logo

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కుట్ర

అతి విలువైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోందని, ఆ చర్యలను తెదేపా వ్యతిరేకించాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ కోరారు.

Published : 22 Jun 2024 03:10 IST

కూటమి ప్రభుత్వం సమర్థంగా అడ్డుకోవాలి
సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్‌ ఈఏఎస్‌ శర్మ లేఖ 

కార్పొరేషన్, న్యూస్‌టుడే: అతి విలువైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోందని, ఆ చర్యలను తెదేపా వ్యతిరేకించాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ‘విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయంపై గత వైకాపా ప్రభుత్వం ద్వంద్వ వైఖరి చూపించడాన్ని ప్రజలు ఏక కంఠంతో ఖండించారు. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కేంద్రం కుట్రను సమర్థంగా అడ్డుకుని ఉక్కును కాపాడాలి. అమెరికాలో లాభాలు గడిస్తున్న మైక్రాన్‌ కంపెనీ గుజరాత్‌లో సెమి కండక్టర్‌ ప్లాంటు పెట్టడానికి కేంద్రం రూ.11వేల కోట్ల రాయితీ ఇస్తోంది. గుజరాత్‌పై వరాలు కురిపిస్తూ, మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు. దీన్ని తెదేపా సహిస్తుందా?. విశాఖ ఉక్కు భూముల విలువే రూ.1.80లక్షల కోట్లు. ప్లాంటు ఖరీదు.. నిపుణులైన ఉద్యోగుల విలువ కడితే దేశంలో ఏ ప్రైవేటు సంస్థ కొనుగోలు చేయలేదనే విషయాన్ని గ్రహించాల’ని లేఖలో ఈఏఎస్‌ శర్మ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని