logo

వైకాపా పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం

వైకాపా పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. అల్లిపురం దరి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 22 Jun 2024 03:11 IST

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి 

అల్లిపురం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. అల్లిపురం దరి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విభజన చట్టంలోని హామీలన్నింటిని అమలు చేసేలా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు లక్షకు పైగా ఉన్న నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. రైల్వేజోన్‌ త్వరితగతిన సాకారం అయ్యేలా చూడాలని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలన్నారు. రుషికొండను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్‌ కట్టిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏయూను వైకాపా రాజకీయ కేంద్రంగా మార్చిన వీసీ ప్రసాదరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జులై 1,2,3 తేదీల్లో మురళీనగర్‌లోని బీవీఆర్‌ గ్రౌండ్‌ కల్యాణమండంలో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు హాజరువుతారని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, కార్యవర్గ సభ్యులు జి.ఎస్‌.జె.అచ్చుతరావు, కసిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని