logo

23న పీవీ అభివందన సభ

మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం లభించిన నేపథ్యంలో ఆయన దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈనెల 23న పీవీ అభివందన సభ పేరుతో నగరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

Published : 22 Jun 2024 03:12 IST

వన్‌టౌన్, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం లభించిన నేపథ్యంలో ఆయన దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈనెల 23న పీవీ అభివందన సభ పేరుతో నగరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. పీవీ 104 జయంతిని పురస్కరించుకొని ఈ సభ ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్‌ సమీపంలోని అంకోసా సమావేశమందిరంలో సాయంత్రం 6గంటలకు విశాఖ రసజ్ఞవేదిక ఆధ్వర్యంలో జగరనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీవీ తనయుడు పీవీ ప్రభాకరరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆత్మీయ అతిథిగా ఆచార్య అయ్యగారి ప్రసన్నకుమార్, గౌరవ అతిథిగా ప్రముఖ పాత్రికేయులు ఏవీ కృష్ణారావు హాజరవుతారని వేదిక అధ్యక్షులు డాక్టర్‌ జి.రఘురామారావు తెలిపారు. పీవీ తెచ్చిన సంస్కరణలు నేటి సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నాయో అతిథులు ప్రసంగిస్తారని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని