logo

శోభాయమానంగా వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం

పోర్టు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై వేంచేసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవం శుక్రవారం శోభాయమానంగా నిర్వహించారు.

Published : 22 Jun 2024 03:20 IST

శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఊరేగింపు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: పోర్టు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై వేంచేసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవం శుక్రవారం శోభాయమానంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో దేవేరుల సమేత స్వామివారిని పల్లకిలో ఉంచి ఊరేగింపుగా మెట్లమార్గం ద్వారా కిందికి తీసుకొచ్చారు. వేద పండితులు, అర్చక స్వాములు ఎదురు సన్నాహం, కోట్నాల ఉత్సవాన్ని ఆద్యంతం ఆసక్తిగా నిర్వహించి రక్తి కట్టించారు. అనంతరం స్వామివారిని భక్తుల గోవిందనామ స్మరణ మధ్య ఊరేగింపుగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. అక్కడ పూలతో అలంకరించిన లాంచీలో ఉత్సవమూర్తులను అధిష్ఠింజేశారు. అనంతరం స్వామివారు దేవేరులతో సముద్రంలో విహరిస్తూ ముందుకు సాగుతుండగా పోర్టు యాజమాన్యం సమకూర్చిన బోట్లు లాంచీని అనుసరించాయి. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కె.శిరీష, ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని