logo

యోగాతో ఆరోగ్యం... ఉల్లాసం!

ప్రపంచ దేశాల మన్నన పొందిన యోగా ప్రాధాన్యాన్ని తెలుసుకుని ఆరోగ్య విశాఖ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీభరత్‌ పిలుపునిచ్చారు.

Updated : 22 Jun 2024 05:21 IST

స్పోర్ట్స్‌ ఎరీనాలో యోగా సాధనలో ఎంపీ శ్రీ భరత్, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ,
ఏడీసీ విశ్వనాథన్, జేసీ మయూర్‌ అశోక్‌

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: ప్రపంచ దేశాల మన్నన పొందిన యోగా ప్రాధాన్యాన్ని తెలుసుకుని ఆరోగ్య విశాఖ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీభరత్‌ పిలుపునిచ్చారు. యోగాను దిన చర్యగా అభ్యసించాలని హితవు పలికారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎంవీపీకాలనీ జీవీఎంసీ ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాలో ఆయుష్‌విభాగం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించి మాట్లాడారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. యోగా గురువుల బృంద సహాయంతో నేచురోపతి వైద్యులు డాక్టర్‌ తులసీరావు అందరితో యోగాసనాలు వేయించారు. అనంతరం ధ్యానం చేయించారు. యోగా గురువులు, నిర్వాహకులు, విద్యార్థులకు జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, జేసీ మయూర్‌ అశోక్, ఏడీసీ విశ్వనాథన్‌  జ్ఞాపికలు అందజేశారు.

పోలీసు మైదానంలో యోగాసనాల్లో సిబ్బంది

పోలీసు మైదానంలో..

యోగాతో మానసిక, శారీరక ఒత్తిడి నుంచి ప్రతి ఒక్కరూ ఉపశమనం పొందవచ్చని నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ అన్నారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలో ఆరోగ్య నిపుణులతో ఆన్‌లైన్‌లో తమ సందేహాలను నివృత్తి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురువులు పర్యవేక్షణలో పోలీసు మైదానంలో సుమారు 700 మంది సిబ్బంది పాల్గొని యోగా చేశారు. జేసీపీ ఫకీరప్ప, డి.సి.పి. వెంకటరత్నం, యోగా గురువు అరుణ, ఏడీసీపీలు, ఏసీపీలు, సి.ఐ.లు, ఆర్‌.ఐ.లు, ఎస్‌.ఐ.లు పాల్గొన్నారు.

పోలీసు మైదానంలో యోగాసనాలు వేస్తున్న సీపీ రవిశంకర్‌

జీవితంలో యోగా అంతర్భాగం కావాలి

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే యోగా ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగం కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్‌ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ యోగా భారతీయుల సంపదని, దాని ప్రయోజనాలను ప్రపంచ దేశాలు గుర్తించి ఆచరిస్తున్నాయన్నారు. శారీరక దారుఢ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని కేవలం యోగా మాత్రమే అందించగలదన్నారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.వెంకటరమణ, న్యాయమూర్తులు కె.రాధారత్నం, కె.వాణిశ్రీ, కె.లలితాదేవి, న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బెవర సత్యనారాయణ, డి.నరేష్‌కుమార్, బార్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.కృష్ఱమోహన్‌ అధికసంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని