logo

బాలికపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం రుజువుకావడంతో ఒక యువకుడికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు.

Published : 11 Jul 2024 02:41 IST

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం రుజువుకావడంతో ఒక యువకుడికి 20 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. నిందితుడు బాధితురాలికి రూ.40 వేల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వం మరో రూ.3.50 లక్షల చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కరణంకృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి. ఆరిలోవ పోలీసుస్టేషన్‌ పరిధి తోటగరువులో నివసిస్తున్న గొండెల సాయికుమార్‌ అలియాస్‌ జీవన్‌ (23) రామాటాకీసు వద్ద ఒక లేబొరేటరీలో పని చేస్తున్నాడు. అరిలోవప్రాంతం శివాజీనగర్‌లో బాలిక (9) తల్లితండ్రులతో ఉంటోంది. 2023 ఏప్రిల్‌ 9న బాలిక తండ్రి సమీప పార్లర్‌ నుంచి టిఫిన్‌ తీసుకురమ్మని చెప్పగా బయలుదేరింది. ఒంటరిగా వెళుతున్న బాలికను నిందితుడు సాయికుమార్‌ బలవంతంగా తన ద్విచక్రవాహనంపై ముడసర్లోవ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను అదే ప్రదేశంలో విడిచిపెట్టాడు. జరిగిన విషయం బాలిక తల్లితో చెప్పగా ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి పైవిధంగా శిక్ష విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని