logo

ప్రభుత్వ ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలి

ప్రభుత్వ ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు.

Updated : 11 Jul 2024 03:46 IST

మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే : ప్రభుత్వ ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో గోకుల్‌చంద్ర, రాహుల్‌ చంద్ర మెమోరియల్‌  ఛారిటబుల్‌ట్రస్టు, సహృదయసాహితి సంయుక్త ఆధ్వర్యంలో ‘విజయ నిఘంటు చంద్రిక’ నిఘంటువు ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయ వాదోపవాదాలు, తీర్పులు కూడా మాతృభాషలోనే జరగాలన్నారు. మాతృభాష పరిరక్షణ కోల్పోతే సర్వం కోల్పోతామన్నారు. తాను కూడా సాహిత్యప్రియుడినే అన్నారు.

భాషలోని పదాల అర్థాలు తెలుసుకునేందుకు ఈ నిఘంటువు బాగా ఉపకరిస్తుందన్నారు. మమకారంతో పాటు సహకారం ఉంటే భాషను పరిరక్షించుకోవచ్చన్నారు. ‘ఇసుకలో రాసి అక్షరాలను నేర్చుకున్న నేను ఉపరాష్ట్రపతిని అయ్యాను కదా’ అన్నారు. సూరపునేని విజయ్‌కుమార్‌ ఈ నిఘంటువు రూపొందించి అంతర్జాలంలో పెట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సహృదయ సాహితీ అధ్యక్షుడు శేఖరమంత్రి ప్రభాకర్, తిరుపతి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణిసదాశివమూర్తి, డాక్టర్‌ కె.సుజని, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, ఆచార్య కోలవెన్ను మలయవాసిని, డాక్టర్‌ డి.వి.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

నిఘంటువును ఆవిష్కరిస్తున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని