logo

Visakhapatnam: కేజీహెచ్‌ ఐసీయూలో పేలిన వెంటిలేటర్‌ బ్యాటరీ..

విశాఖ కేజీహెచ్‌లో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హఠాత్తు ఘటనతో రోగులు, సహాయకులు భయాందోళన చెందారు.

Updated : 18 Jun 2024 07:49 IST

హఠాత్తు ఘటనతో రోగుల్లో భయాందోళన 

ఐసీయూ వార్డులో కమ్ముకున్న పొగ 

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ కేజీహెచ్‌లో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హఠాత్తు ఘటనతో రోగులు, సహాయకులు భయాందోళన చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి..కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ ఐసీయూ వార్డులోని వెంటిలేటర్‌ బ్యాటరీ సోమవారం అర్ధరాత్రి పేలి మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం పొగ వ్యాపించడంతో భయానక పరిస్థితి నెలకొంది. రాత్రి విధుల్లో ఉన్న వైద్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వార్డులో ఉన్న ఏడుగురు రోగులను పిల్లలు, సర్జికల్‌ ఐసీయూకి తరలించారు. తర్వాత వెంటిలేటర్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చే సరికి మంటలు అదుపులోకి వచ్చాయి. కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాదాధికారి డాక్టర్‌ శివానంద ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ జరిపిస్తామన్నారు. రాత్రి 12గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని, 1గంట సమయానికి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు.

కాలిపోయిన వెంటిలేటర్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు