logo

Andhra News: అప్పుల కోసం ప్రభుత్వ స్థలాలు తాకట్టా?.. విశాఖలో కార్పొరేటర్ల ఆందోళన

విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ అప్పుల కోసం ప్రభుత్వ స్థలాలు తనఖా పెట్టొందంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం,

Updated : 26 Feb 2022 13:45 IST

విశాఖ: విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ అప్పుల కోసం ప్రభుత్వ స్థలాలు తనఖా పెట్టొందంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం, జనసేన, సీపీఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. చెత్త పన్నుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం కార్పొరేటర్‌ గంగారాం వినూత్నంగా సీఎం జగన్ బొమ్మతో నిరసన తెలిపారు. పోలీసులు కార్పొరేటర్లను అడ్డగించడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నిరసనలో కార్పొరేటర్లతో పాటు తెదేపా నేతలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. విశాఖలోని భూములు, కార్యాలయాలన్నింటినీ ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేస్తున్నారని వెలగపూడి మండిపడ్డారు. ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచకుండా భూములను తాకట్టు పెట్టుకుంటూ పోతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని