logo

పురుగుల మందు తాగి విద్యార్థిని మృతి

పురుగుల మందు తాగి తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని రాజవరం శివారు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఆదివారం చోటుచేసుకుంది.

Published : 23 Jun 2024 17:30 IST

చిల్పూర్: పురుగుల మందు తాగి తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని రాజవరం శివారు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిల్పూర్ మండలంలోని రాజవరం శివారు ఫకీర్ తండాకు చెందిన ఇస్లావత్ కిషన్ - పీరమ్మ దంపతుల కుమార్తె వర్షిని(14) అనే విద్యార్థిని ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యనభ్యసించింది. ఈ విద్యా సంవత్సరం కోసం గ్రామ శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఈనెల 21న తొమ్మిదో తరగతిలో నూతన అడ్మిషన్ తీసుకుని అందులో చేరింది. కాగా ఘన్‌పూర్ పాఠశాల వాతావరణానికి అలవాటు పడ్డ వర్షిని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉండలేకపోయింది. ఈ నేపథ్యంలో క్షణికావేశంలో ఆలోచించకుండా శనివారం పాఠశాలలో గుర్తుతెలియని పురుగుల మందు తెచ్చుకొని తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది తమ కూతురి మృతిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవని.. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు.

Telugu news, Crime news

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని