logo

బిల్లులు చెల్లించాం.. పనులు చేయండి

పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాము. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌ జిల్లా పాలనాధికారి ప్రావీణ్య కోరారు.

Published : 01 Apr 2023 04:11 IST

సమావేశంలో మేయర్‌ సుధారాణి, కలెక్టర్‌ ప్రావీణ్య, అధికారులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాము. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌ జిల్లా పాలనాధికారి ప్రావీణ్య కోరారు. బల్దియా సమావేశ మందిరంలో స్మార్ట్‌సిటీ పథకం అభివృద్ధి పనులపై సుదీర్ఘ సమీక్ష సమావేశం జరిగింది. భద్రకాళి, వడ్డేపల్లి, ఉర్సు బండ్‌, మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాలు, వ్యర్థాల నిర్వాహణ కేంద్రం, ఆధునిక దోబీఘాట్లు, చెత్త రవాణ కేంద్రాలు, స్మార్ట్‌ రోడ్లు, సమ్మయ్యనగర్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్‌ వరంగల్‌, ఇరిగేషన్‌, ‘కుడా’, టీఎన్పీడీసీఎల్‌ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా మేయర్‌ సుధారాణి, జిల్లా పాలనాధికారి ప్రావీణ్య మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ పథకం ద్వారా మొత్తం రూ.984.55 కోట్లతో 66 పనులు ప్రతిపాదించగా, 27 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 39 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. నాలాలపై కల్వర్టుల నిర్మాణం, రహదారుల విస్తరణలో టౌన్‌ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ విభాగాలు కలిసి పనిచేయాలన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌ లేకుండా చెల్లిస్తున్నామని, నిర్ణీత గడువుల్లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. ఆలస్యం చేస్తే బిల్లుల్లో కోత పెడుతామని హెచ్చరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల సౌకర్యార్థం రంగంపేట ప్రాంతీయ గ్రంథాలయంలో ఇ-బుక్స్‌, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు వెంటేనే అందుబాటులోకి తేవాలయన్నారు. గ్రంథాలయాల్లో పనులు త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, సిటీప్లానర్‌ వెంకన్న, సీహెచ్‌వో శ్రీనివాస్‌రావు, ఈఈలు రాజయ్య, సంజయ్‌కుమార్‌, భీంరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు