logo

చెత్తను తరలించే వాహనాలపై నిఘా

నగరంలోని 66 డివిజన్లలో చెత్తను తరలించే వాహనాలపై నిఘా పెట్టాలని, వెహికిల్‌ ట్రాకింగ్‌  సిస్టమ్‌ ఉండేలా చూడాలని అధికారులను బల్దియా కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశించారు.

Published : 02 Jun 2023 02:55 IST

కేయూసీ కూడలిలో చెత్తను తరలించే ట్రాక్టర్‌ లాగ్‌ బుక్కు పరిశీలిస్తున్న కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరంలోని 66 డివిజన్లలో చెత్తను తరలించే వాహనాలపై నిఘా పెట్టాలని, వెహికిల్‌ ట్రాకింగ్‌  సిస్టమ్‌ ఉండేలా చూడాలని అధికారులను బల్దియా కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశించారు. గురువారం హనుమకొండ ప్రాంతంలో కమిషనర్‌ పారిశుద్ధ్యం, నాలాల పూడికతీత పనులను తనిఖీ చేశారు. గోపాలపూర్‌ వైపు వెళ్తున్న చెత్త ట్రాక్టర్‌ను కమిషనర్‌ ఆపి లాగ్‌ బుక్కు పరిశీలించారు. ఎన్ని ట్రిప్పులు, ఎక్కడ డంపు చేస్తున్నావని కమిషనర్‌ అడిగారు. ఒక ట్రిప్పు రాంపూర్‌ డంపింగ్‌యార్డు, మరో ట్రిప్పు గోపాలపూర్‌లో గుంతలో పోస్తున్నానని డ్రైవర్‌ సమాధానం ఇచ్చాడు. నయీంనగర్‌ నాలాలోని నాలుగు వెంట్ల ద్వారా మురుగు నీరు పారేలా చూడాలని కమిషనర్‌ సూచించారు. ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైయినేజీ పనులు పరిశీలించారు. బడా భవనాల అనుమతులు, ఎన్‌వోసీల స్థలాలు పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ పీవీ.కృష్ణారావు, సిటీప్లానర్‌ వెంకన్న, ముఖ్యఆరోగ్యాధికారి డాక్టర్‌ రాజేష్‌, డీఈలు రవికుమార్‌, సంతోష్‌బాబు, రవికిరణ్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని