logo

వైభవంగా వసంతోత్సవం

శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు.

Published : 19 May 2024 04:34 IST

అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూజా ద్రవ్యాలు అందజేస్తున్న వరంగల్‌ ఉమ్మడి జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు 

రంగంపేట, న్యూస్‌టుడే: శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, బ్రహ్మోత్సవ, వసంతోత్సవ పూజలు చేశారు. ఉదయం 11 గంటలకు చతుర్థాన సేవ, సాయంత్రం సర్వభూపాల(విమానక) వాహన సేవలు జరిగాయి. స్నప్న మండపంలో అమ్మవారికి అభిషేకాలు, సామూహిక కుంకుమార్చన జరిగింది. తెలంగాణ, వరంగల్‌ ఉమ్మడి జిల్లా గౌడ సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిగౌడ్, మోహన్‌గౌడ్, రమేశ్‌గౌడ్, రాజేందర్‌ గౌడ్, పరమేశ్వర్‌ గౌడ్, చిర్ర రాజుగౌడ్, రజనీకాంత్‌ గౌడ్, గీసుకొండ ఎంపీపీ బీమగాని సౌజన్య గౌడ్‌ తదితరులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూజా ద్రవ్యాలు అందించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని