logo

బడి గంట.. ఆనందం వెంట

వేసవి సెలవులు 48 రోజుల తర్వాత జిల్లాలో పాఠశాలలు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. ఆట, పాటలకు టాటా చెప్పి పిల్లలు ఆనందంగా బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను స్వాగతించడానికి విద్యాశాఖ అధికారులు

Published : 13 Jun 2024 05:43 IST

సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  తొలి రోజు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు తీసుకుని సంతోషంగా వెళ్తున్న విద్యార్థినులు 

వేసవి సెలవులు 48 రోజుల తర్వాత జిల్లాలో పాఠశాలలు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. ఆట, పాటలకు టాటా చెప్పి పిల్లలు ఆనందంగా బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను స్వాగతించడానికి విద్యాశాఖ అధికారులు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలతో అలంకరించారు. ఉపాధ్యాయులు పిల్లలకు పూలు అందించి  స్వాగతం పలికారు. తొలి రోజే విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులను అధికారులు, ఉపాధ్యాయులు అందజేశారు. సంతోషంగా వాటిని తీసుకొని సంబరంగా ఇంటికి వెళ్లారు. తొలిరోజు జరిగిన తరగతులకు 32,890 మంది విద్యార్థులకు 17,103 మంది (52 శాతం) హాజరయ్యారు.  విద్యార్థుల రాకతో పాఠశాలల్లో సందడి వాతావారణం నెలకొంది. 

ఈనాడు, హనుమకొండ, వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే 

ప్రార్ధనలో విద్యార్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని