logo

వామ్మో గుడుంబా..!

అధికారులు గుడుంబా స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తుండడంతో జిల్లావాసులు హర్షిస్తున్నా.. మరోవైపు దాని తయారీకి అవసరమైన బెల్లం రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆశిస్తున్నారు

Updated : 14 Jun 2024 05:39 IST

బెల్లం రవాణాపై దృష్టి సారిస్తేనే

గుడుంబా పానకం ధ్వంసం చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది  

అధికారులు గుడుంబా స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తుండడంతో జిల్లావాసులు హర్షిస్తున్నా.. మరోవైపు దాని తయారీకి అవసరమైన బెల్లం రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆశిస్తున్నారు. ముఖ్యంగా బెల్లం ఏ ప్రాంతాల నుంచి వస్తుందో.. రవాణాలో ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకొని ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేయాలని కోరుతున్నారు. గుడుంబా తయారీకి అవసరమైన ముడిసరకు జిల్లాకు రాకుండా పటిష్ఠమైన నిఘా పెట్టినప్పుడే గుడుంబా రహిత జిల్లా లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.


౧౦ తులాల బంగారం చోరీ 

ఈనాడు, మహబూబాబాద్, న్యూస్‌టుడే, నెహ్రూసెంటర్‌: కరోనాకు ముందు జిల్లాలో గుడుంబా తయారీ, అమ్మకాలపై, అందుకు అవసరమైన బెల్లం రవాణా కట్టడికి ఎక్సైజ్, పోలీస్‌శాఖ పెట్టిన నిఘాతో జిల్లా గుడుంబా రహిత జిల్లాగా నిలుస్తుందని ఊహించారు. కరోనా కాలంలో పట్టించుకోపోవడంతో అప్పటి నుంచి బెల్లం రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. తండాలు, ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో గుడుంబా బట్టీల నిర్వహణ జోరందుకొంది. దానికి బానిసలై చిన్న వయసులోనే అసువులుబాసిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ కారణాలతో మళ్లీ గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పోలీస్, ఎక్సైజ్‌శాఖ ఇటీవల నిర్దేశించుకుంది. కొద్ది రోజుల నుంచి గుడుంబా తయారీపై జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. బెల్లం రవాణాను కట్టడి చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా బట్టీల నిర్వహణ కొనసాగుతూనే ఉంది.


ఒక రోజులోనే రూ.1.60 లక్షల గుడుంబా స్వాధీనం

ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌ ఆదేశాలతో మహబూబాబాద్, తొర్రూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని 18 ఠాణాల పోలీసు అధికారులు, సిబ్బంది గురువారం తెల్లవారి గుడుంబా బట్టీలపై దాడులు చేశారు. రూ.1.60 లక్షల విలువైన 402 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. బట్టీలు, రూ.11.10 లక్షల విలువైన బెల్లం పానకం ధ్వంసం చేసి 42 కేసులు నమోదు చేశారు. బెల్లం, పటిక అక్రమ రవాణాతో పాటు గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ హెచ్చరించారు.

జిల్లాలో ఇటీవల ఎక్సైజ్, పోలీసులు నిర్వహించిన దాడులు

  • జూన్‌ 1:  మహబూబాబాద్‌ మండలం బోడగుట్ట తండాలో గుడుంబా పానకం ధ్వంసం. 11 మందిపై కేసు
  • జూన్‌ 4: డోర్నకల్‌ మండలం వెన్నారంలో ఇద్దరిపై కేసు నమోదు.
  • జూన్‌ 5: డోర్నకల్‌ మండల గ్రామాల్లో 22 లీటర్ల గుడుంబా స్వాధీనం. నలుగురిపై కేసు.
  • జూన్‌ 6: సీరోలు మండలంలోని సూర్యతండాలో 9 లీటర్లు స్వాధీనం. ఇద్దరిపై కేసు.
  • జూన్‌ 10: మహబూబాబాద్‌లోని సుందరయ్యనగర్‌ కాలనీ, ఆర్టీసీ కాలనీలో గుడుంబా పానకం ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు .
  • జూన్‌ 11: మహబూబాబాద్‌ పరిధిలోని ఏటిగడ్డతండా, గిరిప్రసాద్‌నగర్‌ కాలనీ, సాలార్‌తండా, కురవి మండలం జగ్యతండాలో 2వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం. 35 లీటర్ల సారాయి స్వాధీనం. నలుగురిపై కేసుల నమోదు చేశారు.
  • జూన్‌ 12న మహబూబాబాద్‌ ఎక్సైజ్‌ పరిధిలోని సాలార్‌తండా, జగ్యతండా, డోర్నకల్‌ మండలం గొల్లచర్లలో 20 లీటర్ల గుడుంబా స్వాధీనం ఒకరిపై కేసు. 

     

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని