logo

ఓరుగల్లు రైల్వేస్టేషన్‌కు కొత్తందాలు

వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం’ కింద రూ.25.41 కోట్ల వ్యయ ప్రణాళికతో పునరాభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి.

Updated : 14 Jun 2024 05:36 IST

వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం’ కింద రూ.25.41 కోట్ల వ్యయ ప్రణాళికతో పునరాభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా స్టేషన్‌ ముందు సిమెంటు స్తంభాలపై ఏర్పాటు చేసిన ఏనుగు బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇటీవల ఏడీఆర్‌ఎం(ఐ) ఎం.గోపాల్‌నాయక్‌ స్టేషన్‌లో అభివృద్ధి పనులు పరిశీలించాక.. వేగం పెరిగింది. విమానాశ్రయంలో మాదిరి స్టేషన్‌ ముందువైపు పచ్చదనంతో నిండిన విశాలమైన, ఆహ్లాదకరమైన ప్రవేశ ద్వారాలను, వాటికి అనుసంధానంగా పార్కింగ్‌ ఏరియా నిర్మించనున్నారు. దీంతో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మరింత సుందరంగా మారనున్నాయి.

- న్యూస్‌టుడే, గిర్మాజీపేట 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని