logo

వంట ఏజెన్సీల బకాయిలు విడుదల

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్న పొదుపు సంఘాల  మహిళల వంట ఖర్చులు, సహాయకుల పారితోషకాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Published : 16 Jun 2024 05:13 IST

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్న పొదుపు సంఘాల  మహిళల వంట ఖర్చులు, సహాయకుల పారితోషకాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో వంట దినుసులకు రూ.4,19,07,210, సహాయకుల పారితోషికంగా రూ.1,62,44,500 మొత్తం కలిపి రూ.5,81,51,710 విడుదల చేసింది. నిత్యావసరాల ధరలు ప్రతి రోజు పెరుగుతున్నాయని, ఏ నెలకు ఆనెల విడుదల చేస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందని, నెలలుగా పెండింగ్‌లో పెడితే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని పొదుపు సంఘాల మహిళలు   కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని