logo

మరమ్మతు చేస్తేనే.. సాగు నీరు

సుమారు మూడు వేల ఎకరాలకు సాగు నీరందించే ములుగు పట్టణ సమీపంలోని లోకం చెరువు నిరాదరణకు గురవుతోంది.

Published : 16 Jun 2024 05:15 IST

ఇక్కడ నీరు వృథాగా పోతున్నది ములుగు సమీపంలోని లోకం చెరువు తూము కాలువ. తూముకు లీకేజీ ఏర్పడటంతో తటాకంలోని నీరంతా ఇలా బయటకు వెళ్తోంది.

ములుగు, న్యూస్‌టుడే: సుమారు మూడు వేల ఎకరాలకు సాగు నీరందించే ములుగు పట్టణ సమీపంలోని లోకం చెరువు నిరాదరణకు గురవుతోంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ తటాకానికి సరైన మరమ్మతులు లేక పరిస్థితి దయనీయంగా మారింది. అధికారులు మరమ్మతులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయకట్టు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ వానాకాలం పంటలెలా సాగు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

త్వరితగతిన పనులు చేయిస్తేనే..

లోకం చెరువు తూముకు లీకేజీ ఏర్పడటంతో నీరంతా వృథాగా పోతోంది. ఈ విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేదని సమీప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీని అరికడితేనే ఖరీఫ్‌ సీజన్‌లో సేద్యం కొనసాగనుంది. వర్షాలు ఎక్కువైతే లీకేజీని నియంత్రించడం కష్టంగా మారుతుంది. త్వరితగతిన నిధులు కేటాయించి తూముకు మరమ్మతులు చేయిస్తేనే కర్షకులకు ఉపయోగం. లేదంటే ఈ వానాకాలంలో ఆయకట్టు భూములు బీడువారే పరిస్థితి నెలకొంది. 


ప్రతిపాదనలు పంపించాం.. 

- రవీందర్‌ రెడ్డి, డీఈ, నీటిపారుదల శాఖ

లోకం చెరువు తూము లీకేజీకి సంబంధించి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లీకేజీ ప్రదేశంలో మట్టి నింపాలని లష్కర్‌కు సూచించా. తూము మత్తడి మరమ్మతులకు రూ.6 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. బడ్జెట్‌ వచ్చిన వెంటనే మరమ్మతులు చేస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని