logo

రూ.10 కోట్లు అప్పుచేసి ఉడాయించిన వ్యాపారి

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో ఓ వ్యాపారి రూ.10 కోట్ల మేర అప్పుచేసి ఉడాయించడంతో బాధితులు శనివారం ఆయన ఇంటిపై దాడికి యత్నించారు.

Published : 16 Jun 2024 05:17 IST

 రోడ్డుపై బైఠాయించిన బాధితులు 

బయ్యారం, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో ఓ వ్యాపారి రూ.10 కోట్ల మేర అప్పుచేసి ఉడాయించడంతో బాధితులు శనివారం ఆయన ఇంటిపై దాడికి యత్నించారు. బాధితుల కథనం ప్రకారం.. గణేష్‌ అనే వ్యాపారి సుమారు 150 మంది నుంచి వివిధ సమయాల్లో రూ.10 కోట్లు అప్పు చేశారు. ఆయన గ్రామం నుంచి ఉడాయించారని తెలుసుకుని బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జనం ఒక్కసారిగా ఆయన ఇంటిపైకి దాడికి యత్నంచారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని నిలువరించారు. అంతటితో ఆగని బాధితులు బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకొని రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇల్లెందు, మహబూబాబాద్‌ ప్రధాన రహదారిపై గంటపాటు వాహనాలు ఎక్కడకక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న ఎస్సై ఉపేందర్‌ బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. గణేష్‌ కుటుంబాన్ని అరెస్ట్‌చేసి తమకు డబ్బు ఇప్పించాలని బాధితులు పోలీసులను డిమాండ్‌ చేశారు. కోర్టులో ఐపీ పెట్టకుండా అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని, న్యాయస్థానాలను వేడుకున్నారు. బాధితులు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని