logo

ఎమ్మెల్యేగా సందర్శన.. అధ్యాపకుడై బోధన

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  లింగాలఘనపురం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, ఆదర్శ పాఠశాలను శనివారం సందర్శించారు.

Published : 16 Jun 2024 05:27 IST

బోర్డుపై సుద్దముక్కతో రాస్తున్న ఎమ్మెల్యే శ్రీహరి 

న్యూస్‌టుడే, లింగాలఘనపురం: స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  లింగాలఘనపురం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, ఆదర్శ పాఠశాలను శనివారం సందర్శించారు. పాఠశాలలో వసతులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం అధ్యాపకుడై ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యాంశాన్ని బోధించారు. ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ రెండో సంవత్సరం తరగతి గదిలో సుద్దముక్కతో బోర్డుపై ఎన్‌హెచ్‌4(అమోనియా) రాసి విస్తరించాలని కోరుతూ విద్యార్థులతో జవాబు రాబట్టారు. ఇంటర్మీడియట్‌ సీఈసీ తరగతి గదిలో రాజ్యాంగం రాసినవారెవరు..? పార్లమెంట్‌లో విభాగాలెన్ని..? వరంగల్‌ ఎంపీ ఎవరనే ప్రశ్నలు అడిగారు. డీఈవో రాము, ప్రిన్సిపల్‌ పుష్పకుమారి, ప్రత్యేకాధికారిణి అన్నపూర్ణ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని