logo

డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలి

డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని బహుజన విద్యార్థి సంఘం (బీఎస్‌ఎఫ్‌) హనుమకొండ అధ్యక్షుడు బొట్ట మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 16 Jun 2024 05:33 IST

మాట్లాడుతున్న బీఎస్‌ఎఫ్‌ నాయకులు 

విద్యానగర్, న్యూస్‌టుడే: డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని బహుజన విద్యార్థి సంఘం (బీఎస్‌ఎఫ్‌) హనుమకొండ అధ్యక్షుడు బొట్ట మనోహర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయం ముందు ఏర్పాటు చేసిన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల టెట్లో అర్హత సాధించిన వారికి డీఎస్సీ కోసం సన్నద్ధం కావడానికి కనీసం మూడు నెలల గడువు ఇవ్వాలని కోరారు. జులై 17 నుంచి కాకుండా అక్టోబరులో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు, బీఎస్‌ఎఫ్‌ నాయకులు మహేందర్, ప్రవీణ్, భరత్, రాధిక, కవిత, నరేష్, దిలీప్, ఆఫీజ్, కార్తీక్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని