logo

వాగు దాటాలంటే.. వణుకే

వాగు నీటిని నిల్వ చేసేందుకు నిర్మించిన చెక్‌డ్యామ్‌తో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట శివారులోని పాకాల వాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మించడంతో వాగు అవతలి వైపు పొలాలు ఉన్న రైతులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు.

Published : 16 Jun 2024 05:36 IST

థర్మాకోల్‌ షీట్‌ సాయంతో వాగు దాటుతూ.. శుద్ధరేవుల కట్టపై బిక్కుబిక్కుమంటూ.. 

ఈనాడు, హనుమకొండ, న్యూస్‌టుడే, చెన్నారావుపేట: వాగు నీటిని నిల్వ చేసేందుకు నిర్మించిన చెక్‌డ్యామ్‌తో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట శివారులోని పాకాల వాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మించడంతో వాగు అవతలి వైపు పొలాలు ఉన్న రైతులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. గతంలో వాగుపై శుద్ధరేవుల ఆనకట్ట నిర్మించారు. అదే వాగుపై మళ్లీ చెక్‌డ్యామ్‌ నిర్మించారు. పాపయ్యపేట, అమృతండా, 16 చింతల్‌తండా, ధర్మతండాలకు చెందిన రైతులకు వాగు అవతలి వైపు సుమారు 500 ఎకరాల సాగుభూమి ఉంది. గతంలో శుద్ధరేవుల కట్టపై నుంచి వెళుతుండగా వాగులో పడి పలువురు మృతి చెందారు. ప్రస్తుతం రైతులు థర్మాకోల్‌ షీట్స్‌ సాయంతో ప్రమాదకరస్థితిలో వాగు దాటుతున్నారు. అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని రైతులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని