logo

వృద్ధులను గౌరవించడం కుటుంబ సభ్యుల బాధ్యత

వయోవృద్ధులు గౌరవంగా బతికే స్వేచ్ఛను ఇవ్వడం మన బాధ్యత అని వరంగల్‌ జిల్లా సంక్షేమశాఖ అధికారి హైమావతి తెలిపారు.

Published : 16 Jun 2024 05:38 IST

మాట్లాడుతున్న జిల్లా సంక్షేమశాఖ అధికారి హైమావతి 

కొత్తవాడ, న్యూస్‌టుడే: వయోవృద్ధులు గౌరవంగా బతికే స్వేచ్ఛను ఇవ్వడం మన బాధ్యత అని వరంగల్‌ జిల్లా సంక్షేమశాఖ అధికారి హైమావతి తెలిపారు. శనివారం కొత్తవాడలోని ఓ వేడుకల మందిరంలో ‘ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం’పై సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. వృద్ధులను వేధించకుండా వారికి తగిన గౌరవం ఇవ్వడం కుటుంబ సభ్యుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వచ్చే వృద్ధులతో మర్యాదగా మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించాలని వరంగల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొన్‌రెడ్డి మల్లారెడ్డి కోరారు. వయోవృద్ధులను వేధింపులకు గురిచేస్తున్న వారిపై తల్లిదండ్రుల, వృద్ధుల, పోషణ సంరక్షణ చట్టం-2007 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది సురేష్, సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సదానందం, సంజీవరావు, గోవర్ధన్, ఉమాదేవి, మల్లిక, వెంకటమల్లు, రాజేంద్రప్రసాద్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని