logo

ఆర్భాటంగా ఏర్పాటు.. నిర్వహణలో తడబాటు

ప్రస్తుతం నగరంలోని పలు కూడళ్లను రూ.లక్షలు వెచ్చించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. చాలాచోట్ల సహజత్వం ఉట్టిపడేలా వినూత్న బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు.

Published : 16 Jun 2024 05:39 IST

ప్రస్తుతం నగరంలోని పలు కూడళ్లను రూ.లక్షలు వెచ్చించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. చాలాచోట్ల సహజత్వం ఉట్టిపడేలా వినూత్న బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ! గతంలో ఇలా ఏర్పాటు చేసిన బొమ్మల నిర్వహణను గాలికొదిలేశారు. అప్పుడు ఏర్పాటు చేసిన బొమ్మలు.. కొద్దిరోజులకే రంగులు కోల్పోయి పోయి కళావిహీనంగా మారాయి. గతంలో వరంగల్‌ ఉర్సు గుట్ట కూడలిలో రూ.30 లక్షలు వెచ్చించి పాలపిట్టల బొమ్మలు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం అవి రంగులు వెలసిపోయాయి. కూడళ్లను ఆధునికీకరించడంతో పాటు నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

ఈనాడు, హనుమకొండ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని