logo

చిరువ్యాపారులు, నిరుద్యోగ యువతకు చేయూత

వరంగల్‌ నగరంలో 50 మంది చిరు వ్యాపారులకు రూ.30 లక్షల విలువైన కోడిగుడ్ల బండ్లు(ఎగ్‌కార్ట్స్‌) పంపిణీ చేశారు.

Published : 16 Jun 2024 05:40 IST

చిరువ్యాపారులకు బండ్లతో పాటు సామగ్రి అందిస్తున్న నెక్‌ జోనల్‌ ఛైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు 

లేబర్‌కాలనీ, న్యూస్‌టుడే: వరంగల్‌ నగరంలో 50 మంది చిరు వ్యాపారులకు రూ.30 లక్షల విలువైన కోడిగుడ్ల బండ్లు(ఎగ్‌కార్ట్స్‌) పంపిణీ చేశారు. ఓసిటీలోని నెక్‌ కార్యాలయంలో జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో నెక్‌ జోనల్‌ ఛైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చేతుల మీదుగా పంపిణీ జరిగింది. రూ.60 వేల విలువైన బండితో పాటు హోటల్స్‌ నిర్వాహకులు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, టీస్టాళ్లలో వినియోగించే సామగ్రి, గ్యాస్‌ పొయ్యి, కుర్చీలు ఇతర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌రావు మాట్లాడుతూ.. నెక్‌ జాతీయ అధ్యక్షురాలు అనురాధ దేశాయ్‌ డ్రీమ్‌ ప్రాజెక్టుగా కోడిగుడ్ల బండ్ల పంపిణీ చేపట్టి.. చిరువ్యాపారులు, నిరుద్యోగ యువతకు చేయూత అందిస్తున్నట్లు వివరించారు. ఏప్రిల్‌లో పైలట్ ప్రాజెక్టుగా 20 మందికి ఎగ్‌కార్ట్స్‌ అందించామన్నారు. అవి విజయవంతం కావడంతో ఈసారి 50 మందికి ఇస్తున్నామని పేర్కొన్నారు. నెక్‌ సీవోవో డాక్టర్‌ అన్నామలై ఎజిల్‌కుమార్, పౌల్ట్రీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, నెక్‌ ప్రతినిధులు వి.రామారావు, సుబ్రమణ్యం, శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్‌రావు, రాంప్రసాద్, ఆవుల చంద్రయ్య, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని