logo

కూచిపూడి నృత్య ప్రదర్శనకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు

జనగామ పట్టణంలోని బతుకమ్మకుంట మైదానంలో మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం 108 మంది చిన్నారులు 15 నిమిషాల వ్యవధిలో కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు భజగోవిందం శ్లోకాలు,

Published : 17 Jun 2024 02:52 IST

జనగామ టౌన్, న్యూస్‌టుడే: జనగామ పట్టణంలోని బతుకమ్మకుంట మైదానంలో మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం 108 మంది చిన్నారులు 15 నిమిషాల వ్యవధిలో కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు భజగోవిందం శ్లోకాలు, ధ్యానం ప్రదర్శనకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కింది. కూచిపూడి శిక్షకులు పులిగిళ్ల సుకేష్‌ పర్యవేక్షణలో ప్రదర్శన నిర్వహించారు. చిన్నారుల ప్రదర్శన వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో నమోదైనట్లు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ప్రతినిధి బింగి నరేందర్‌గౌడ్‌ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జమున, పాలకుర్తి కోదండరామశర్మ, అనిత, రవి, లక్ష్మి, పల్లవి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని