logo

రుణమాఫీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

ఆగస్టులో ప్రభుత్వం రూ.2 లక్షల రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేయనుందని...ఆగస్టు నుంచి జనవరి మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయని ప్రభుత్వ విప్, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ చెప్పారు.

Published : 18 Jun 2024 03:30 IST

దంతాలపల్లిలో మంత్రి సీతక్కకు జ్ఞాపికను అందజేస్తూ..

దంతాలపల్లి, న్యూస్‌టుడే: ఆగస్టులో ప్రభుత్వం రూ.2 లక్షల రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేయనుందని...ఆగస్టు నుంచి జనవరి మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయని ప్రభుత్వ విప్, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌ చెప్పారు. దంతాలపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది. మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్‌ పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. డోర్నకల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అన్నారు. గ్రామస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ ముందుకు సాగాలన్నారు. దంతాలపల్లి, దాట్ల, పెద్దముప్పారం గ్రామాల్లోని జడ్పీ ఉన్నత పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. దాతలతో వాటి రూపురేఖలు మార్చాలన్నారు. రానున్న ఏడాది చెరువుల పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5800 ఏకోపాధ్యాయ బడులను మూసివేసిందన్నారు. భారాస విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆగస్టు నుంచి దశల వారీగా రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు భట్టు, సొసైటీ ఛైర్మన్‌ రాము, ఎంపీటీసీ సభ్యులు యాకయ్య, సతీష్, మండల బాధ్యులు బాలాజీ, నవీన్‌రెడ్డి, చిన్నరాములు, రవీందర్, గీర్వాణి, అనిల్, జానీపాషా, లింగారెడ్డి, కొమురెల్లితో పాటు తదితరులున్నారు. 

దంతాలపల్లిలో మంత్రి సీతక్క, మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్, డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌తో కలిసి ఓ వేడుకలో  పాల్గొన్నారు. మంత్రి, ఎంపీలను స్థానిక నేతలు సన్మానించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని