logo

సంత.. సౌకర్యాల చింత

ఉమ్మడి జిల్లాలోనే పాలకుర్తిలో సోమవారం నిర్వహించే సంతకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మేలైన మేకలు, గొర్రెలతోపాటు పాడి పశువులు, గెదేలు విరివిగా లభిస్తాయని నమ్మకం. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి కొనుగోళ్లకు వస్తుంటారు.

Published : 18 Jun 2024 03:41 IST

రోడ్డుపైనే క్రయవిక్రయాలు..

పాలకుర్తి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోనే పాలకుర్తిలో సోమవారం నిర్వహించే సంతకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మేలైన మేకలు, గొర్రెలతోపాటు పాడి పశువులు, గెదేలు విరివిగా లభిస్తాయని నమ్మకం. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి కొనుగోళ్లకు వస్తుంటారు. సుమారు 2-3 ఎకరాల్లో ప్రాంగణం ఉండగా, ఊర చెరువులోని బతుకమ్మ ఆడే ప్రదేశాన్ని సైతం ఉపయోగించుకుంటున్నారు. చిరువ్యాపారులు నేలపైనే క్రయవిక్రయాలు జరుపుతున్నారు. అంతేగాక ఈ దారుల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సంత ఆదాయం ఏటేటా పెరుగుతున్నా, సమస్యలు మాత్రం తీరడం లేదన్న ఆరోపణలున్నాయి.

తాగునీటి అవస్థలు..

పశువుల సంత, కూరగాయల మార్కెట్‌లో తాగునీరుకు వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ చేతిపంపు, బోరు ఉన్నప్పటికీ అపరిశుభ్రత కారణంగా వినియోగించుకోలేని దుస్థితి. నీటితొట్టె వద్ద మురుగునీటి కుంట ఉండటంతో పశువుల దాహార్తికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పలు వీధి దీపాలు వెలగలేని పరిస్థితి నెలకొంటోంది.

గూడు కరవు..

పూర్తి స్థాయిలో షెడ్డులు, సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఎండ, వానలకు తడుస్తూనే క్రయవిక్రయాలు జరుపుతున్నారు. దీంతో  అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మెరుగైన వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రతి వ్యాపారి నుంచి రుసుం స్వీకరిస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.

క్షేత్రస్థాయిలో కొంత మేర సమస్యలున్నాయి.. వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరచారి వివరించారు.

సంవత్సరం అంగడి ఆదాయం (రూ.లక్షల్లో)

2021-22    22.25
2022-23    24
2023-24    29.10 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని