logo

ఆనందమానందమాయే..!

ఎట్టకేలకు ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియకు తెర పడింది. తొమ్మిది ఏళ్ల తర్వాత చేపట్టిన పదోన్నతుల ప్రక్రియ గతేడాది జనవరి 2023న ప్రారంభించగా.. వివిధ ఆటంకాలతో వాయిదా పడుతూ వచ్చింది.

Published : 20 Jun 2024 05:18 IST

358 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి
వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే

అధికారుల నుంచి పత్రాలు అందుకుంటున్న ఉపాధ్యాయులు

ఎట్టకేలకు ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియకు తెర పడింది. తొమ్మిది ఏళ్ల తర్వాత చేపట్టిన పదోన్నతుల ప్రక్రియ గతేడాది జనవరి 2023న ప్రారంభించగా.. వివిధ ఆటంకాలతో వాయిదా పడుతూ వచ్చింది. 18 నెలల తర్వాత ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి పదోన్నతుల ఉత్తర్వులను రాష్ట్ర విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులకు జారీ చేసింది. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు బుధవారం ఉత్తర్వులు అందించి.. వెంటనే సంబంధిత పాఠశాలల్లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విషయం తెలిసిన ఉపాధ్యాయుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎంతో కాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తమ జీవితాల్లో జూన్‌ 19 మరచిపోలేని రోజు అని కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో సంబరాలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో 358 మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొందినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలకు మేరకు ఆయా మండల విద్యాశాఖ అధికారుల నుంచి పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు అర్డర్‌ తీసుకోవాలని సమాచారం అందించినట్లు చెప్పారు. వెంటనే ఆయా పాఠశాలల్లో రిపోర్ట్‌ చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. సాంకేతిక ఇబ్బందులతో రోస్టర్‌ పాయింట్ల కారణంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాల పీఈటీలు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలతో పాటు స్కూల్‌ అసిసెంట్ల పదోన్నతుల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. సబ్జెక్టుల వారీగా పదోన్నతి పొందిన జాబితా వివరించారు.

మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి

జిల్లాలోని ఉపాధ్యాయులు ఎస్జీటీ, సమాన కేటగిరీల టీచర్లు గతంలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకొని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 1 నాటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసి, ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలలో రెండు సంవత్సరాలు పూర్తయిన వారు అర్హులు. గతంలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు తిరిగి చేయాల్సిన అవసరం లేదు. గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలి.

 వాసంతి, డీఈఓ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని