logo

కొండెక్కిన కూరగాయల ధరలు

గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు లభ్యం కావాల్సిన కూరగాయలు అధిక ధరలతో కొండెక్కాయి. ఈ ధరలతో పల్లె జనం కొనలేని పరిస్థితి నెలకొంటోంది. వేసవి తీవ్రతతో సాగు అంతంత మాత్రంగానే ఉండటం, వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడంతో దిగుబడి తగ్గడంతో, ఫలితంగా ధరలు రెట్టింపవుతున్నాయి.

Published : 21 Jun 2024 02:38 IST

కొడకండ్ల సంత..

కొడకండ్ల, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు లభ్యం కావాల్సిన కూరగాయలు అధిక ధరలతో కొండెక్కాయి. ఈ ధరలతో పల్లె జనం కొనలేని పరిస్థితి నెలకొంటోంది. వేసవి తీవ్రతతో సాగు అంతంత మాత్రంగానే ఉండటం, వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడంతో దిగుబడి తగ్గడంతో, ఫలితంగా ధరలు రెట్టింపవుతున్నాయి. గత వారం రోజులుగా కూరగాయల ధరలను పరిశీలిస్తే అధికంగా నమోదయ్యాయి. సంతలో కొనుగోలు చేస్తే తక్కువకు లభిస్తాయని వచ్చిన వారికి నిరాశ ఎదురవుతోంది. గతంలో కంటే తక్కువ కూరగాయల క్రయవిక్రయాలు జరుపుతున్నామని, అవి రెండు, మూడు రోజులకే సరిపోతున్నాయని పలువురు వాపోతున్నారు. రవాణా ఛార్జీలు అన్నీ లెక్క చేసుకొంటే తమకు కొద్ది మొత్తంలోనే మిలుగుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

గతంలో కంటే అధికంగా వెచ్చిస్తున్నాం.. 

- చిలుసాని లక్ష్మి - కొడకండ్ల

ధరలు మండిపోతున్నాయి. మధ్య తరగతి ప్రజలకు ఇవి పెద్ద భారంలా మారాయి. గతంలో రూ.150 పెడితే వారం సరిపోయేవి.. ఇప్పుడు రూ.250 కంటే ఎక్కువ అవుతోంది. తక్కువ రకాలను తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ధరలు ఇంకా రెట్టింపు కాకముందే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని