logo

రోడ్డుపై నోట్ల కట్టల కలకలం

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు ప్రధాన రహదారిపై రూ.నోట్ల కట్టల మూట పడినట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొట్టింది.

Published : 21 Jun 2024 02:39 IST

మల్లూరు(మంగపేట), న్యూస్‌టుడే: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు ప్రధాన రహదారిపై రూ.నోట్ల కట్టల మూట పడినట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొట్టింది. కొంత నగదు స్థానికులకు దొరికినట్లు సమాచారం. ఈ నోట్లు ఎవరివనేది చర్చనీయాంశంగా  మారింది. ఎంత డబ్బు దొరికిందనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై మంగపేట ఎస్సై సూరిని వివరణ కోరగా.. నోట్ల కట్టలు కలకలం సృష్టింది అవాస్తవమన్నారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని