logo

పాన్‌కార్డుంటేనే పరిహారం మంజూరు

మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో తాజాగా పరిహారం మంజూరులో పాన్‌కార్డు ప్రస్తావన కార్మికులను కంగారు పెడుతుంది.

Published : 24 Jun 2024 02:34 IST

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: మత్స్య కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో తాజాగా పరిహారం మంజూరులో పాన్‌కార్డు ప్రస్తావన కార్మికులను కంగారు పెడుతుంది. కార్మికులకు ప్రమాద బీమా సదుపాయం కల్పించిన నేపథ్యంలో చెల్లింపులో పాన్‌కార్డు ఉండాలని ఆదేశించింది. ప్రతి సభ్యుడు కచ్చితంగా బ్యాంకులో పొదుపు ఖాతా కలిగి ఉండాలని, ఆధార్‌ కార్డు, పాన్, చరవాణి నెంబరును అందిస్తూ సభ్యత్వం పొందాలని ఆదేశించారు. కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, గాయపడి శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.2.5 లక్షలు, ప్రమాదం బారిన పడితే రూ.25 వేల పరిహారం మంజూరు చేస్తుంది. చెల్లింపులో మరింత పారదర్శకత కోసం తేడాలు కనీసానికి తగ్గించడానికి గాను ప్రతి సభ్యుడు పాన్‌ కార్డు (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబరు) కలిగి ఉండాలని దీంతో కుటుంబ సభ్యులకు పరిహారం అందుతోందని అధికారులు వివరిస్తున్నారు. ఇది వాస్తవమేనని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులు ‘న్యూస్‌టుడే’ కు చెప్పారు. ఈ విషయమై బహుళ ప్రచారం చేస్తున్నామని వివరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని