logo

అమ్మవారికి విశేష పూజలు

శ్రీభద్రకాళి శాకాంబరి మహోత్సవాల్లో భాగంగా అయిదో రోజు బుధవారం ఉదయం ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, శాకాంబరి నవరాత్రుల విశేష పూజలు నిర్వహించారు.

Updated : 11 Jul 2024 06:17 IST

రంగంపేట, న్యూస్‌టుడే: శ్రీభద్రకాళి శాకాంబరి మహోత్సవాల్లో భాగంగా అయిదో రోజు బుధవారం ఉదయం ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, శాకాంబరి నవరాత్రుల విశేష పూజలు నిర్వహించారు. బుధవారం తిథి ద్వయం కావడంతో అమ్మవారి దశ మహావిద్యల్లోని కాళీ క్రమాన్ని అనుసరంచి ఉదయం కురుకుల్లా, సాయంత్రం భేరుండా మాతగా అలంకరించి పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు