logo

పుష్కరాలకు ముమ్మర ఏర్పాట్లు

కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలకు బుధవారం మధ్యాహ్నం అంకురార్పణ జరుగుతుంది. ఇందుకోసం తాత్కాలిక ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాధారణ ఘాట్‌ వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మూడు షెవర్లు పెట్టారు. మోటారును

Published : 12 Apr 2022 02:04 IST

ఘాట్‌ వద్ద జల్లు స్నానాల కోసం...

కాళేశ్వరం(జయశంకర్‌ జిల్లా), న్యూస్‌టుడే: కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలకు బుధవారం మధ్యాహ్నం అంకురార్పణ జరుగుతుంది. ఇందుకోసం తాత్కాలిక ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాధారణ ఘాట్‌ వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మూడు షెవర్లు పెట్టారు. మోటారును బిగించాల్సి ఉంది. ఒకే సమయంలో 36 మంది జల్లు స్నానాలు చేయొచ్చు. దుస్తులు మార్చుకోవడానికి రెండు షెడ్లు నిర్మించారు. మెట్లకు సమీపంలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రముఖుల ఘాట్‌ వద్ద దుస్తులు మార్చుకోవడానికి నిర్మాణాలు చేపట్టలేదు.

తాత్కాలిక మరుగుదొడ్లు

మూడు చోట్ల పార్కింగ్‌: మూడు ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. బృహత్‌ ప్రకృతి వనం నిర్మాణ స్థలం, దీనికి ఎదురుగా ప్రైవేటు వెంచర్‌లో, ఆదిముక్తీశ్వారాలయానికి సమీపంలో పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఇసుక తేలింది...: వారం రోజులకు ముందు ఉభయ నదుల నీటిమట్టం పుష్కర ఘాట్‌ మెట్లను తాకుతూ ప్రవహించింది. లక్ష్మీ బ్యారేజీలో మోటార్లను నడిపించి జలాలను ఎత్తిపోయడంతో నీటిమట్టం తగ్గి ఇసుక తేలింది. దీంతో భక్తుల పుణ్యస్నానాలు చేసి ఇసుక తీరానికి చేరుకుంటారు.

దుస్తులు మార్చుకునే గదులు

ముస్తాబైన క్షేత్రం

కాళేశ్వరం, న్యూస్‌టుడే: ప్రాణహిత పుష్కరాలకు కాళేశ్వరం దేవస్థానం ముస్తాబైంది. ఆలయ ఆవరణంలో చలువ పందిళ్లు  వేశారు. ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. క్యూలైన్‌ వెంట భక్తులకు తాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేశారు. పుణ్యస్నానాలు చేసిన భక్తజనులు శివుడి సన్నిధిని చేరుకుంటారు. ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మహేశ్‌ చెప్పారు. ప్రసాదాల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. మొదటి రోజు 10 క్వింటాళ్ల లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తామన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు