logo

జిల్లాను అభివృద్ధిబాట పట్టిస్తాం

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో పయనింపజేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన గురువారం తొలిసారి ఏలూరులోని తెదేపా జిల్లా కార్యాలయానికొచ్చారు.

Published : 14 Jun 2024 04:14 IST

అసంపూర్తి పథకాలను పూర్తి చేస్తాం 
ఆక్వా, ఆయిల్‌పామ్‌ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రి

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న పార్థసారథి. చిత్రంలో ఎంపీ మహేశ్‌యాదవ్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, మాజీ ఎమ్మెల్యే గన్ని తదితరులు

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో పయనింపజేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన గురువారం తొలిసారి ఏలూరులోని తెదేపా జిల్లా కార్యాలయానికొచ్చారు. తెదేపా నాయకులు, నూతన ఎమ్మెల్యేలు బడేటి చంటి, రోషన్‌ కుమార్‌ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను వైకాపా ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపేసిందని, రాబోయే రెండేళ్లలో వాటిని పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనించినందునే ఎన్డీయేకు అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తామని హామీ ఇచ్చారు. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆయిల్‌పామ్‌ గెలల ధరలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మహేశ్‌ యాదవ్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, సొంగా రోషన్‌ కుమార్, జనసేన నాయకుడు రెడ్డి అప్పలనాయుడు, మాజీ మంత్రి మరడాని రంగారావు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని