logo

అడుగంటుతోన్న చెరువులు

పల్లెల్లోని చెరువుల్లోని జలాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీనే పంటకాలువలకు నీరొదిలినా అవి శివారు ప్రాంతాలకు చేరలేదు

Published : 14 Jun 2024 04:51 IST

స్వచ్ఛ జలాల కోసం ఎదురుచూపులు

చినకాపవరం మంచినీటి చెరువులో అడుగంటిన నీరు 

ఆకివీడు, ఉండి, న్యూస్‌టుడే: పల్లెల్లోని చెరువుల్లోని జలాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీనే పంటకాలువలకు నీరొదిలినా అవి శివారు ప్రాంతాలకు చేరలేదు. దీంతో వివిధ గ్రామాల్లోని చెరువుల్లో నీరు నింపుకొనే అవకాశాలు కన్పించడంలేదు. ప్రధానంగా ఉండి మండలం ఆరేడు, కలిగొట్ల, యండగండి, పాందువ్వ, అర్తమూరు, ఉప్పులూరు, కోలమూరు, ఉండి, పెదపుల్లేరు, చినపుల్లేరు తదితర గ్రామాలకు వెళ్లే ఉపకాలువల్లోకి స్వచ్ఛమైన నీరందని పరిస్థితి నెలకొంది. పంటకాలువల్లోని వ్యర్థాలను పూర్తిస్థాయిలో బయటకు పంపిస్తే తప్ప మంచినీటి చెరువులను నింపే అవకాశాలు కన్పించడంలేదని ప్రజలు వాపోతున్నారు. 

ఆకివీడు అనాలచెరువులో ..

ఆకివీడు నగర పంచాయతీ, మండలంలోని పలు గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరు అడుగంటుతోంది. అనేక చెరువుల్లో వారం, 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అడుగంటే పరిస్థితి ఉంది. కాలువలకు నీటిని విడుదల చేసినా వెంకయ్యవయ్యేరు, పాతవయ్యేరు వాటి అనుబంధ కాలువల్లో తూడు, గుర్రపుడెక్క భారీగా మేటవేసి ఉండటంతో ప్రవాహానికి అవరోధంగా మారింది. ఈ అంశంపై జలవనరుల శాఖ ఉండి డీఈఈ మూర్తి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ కాలువల్లో చెత్త తొలగింపు పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. కాలువల్లోకి స్వచ్ఛమైన నీరొస్తున్నచోట్ల పల్లెల్లో చెరువులు నింపుకోవాలని ఆయన కోరారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని