logo

పెనుగాలుల బీభత్సం

పోలవరం ప్రాంతంలో శనివారం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. జాతీయ రహదారిపై ప్రగడపల్లి, పట్టిసీమ గ్రామాల వద్ద చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Updated : 16 Jun 2024 06:55 IST

జాతీయ రహదారిపై పడిపోయిన చెట్లు.. రాకపోకలకు అంతరాయం

వెంకటాపురం సమీపంలో జాతీయ రహదారిపై కూలిన చెట్టు  

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాంతంలో శనివారం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. జాతీయ రహదారిపై ప్రగడపల్లి, పట్టిసీమ గ్రామాల వద్ద చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత్యంతరం లేక పొలాల నుంచి బురదలో వెళ్లారు. బస్సులు, ఆటోల్లో వచ్చిన ప్రయాణికులు, మహిళలు పిల్లలతో కలిసి నడిచి స్వగ్రామాలకు చేరుకున్నారు. పట్టిసీమలో వినాయకుడి ఆలయం పక్కనున్న చెట్టు వేళ్లు సహా జాతీయ రహదారిపై పడింది. ఓ ఇంటి షెడ్డుపై కొమ్మ విరిగిపడిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. సాయంత్రం 4 గంటల నుంచి పోలవరానికి వచ్చే మార్గాలు అన్నీ మూసుకుపోయాయి. కన్నాపురం నుంచి వెంకటాపురం వరకు దారిపొడవునా చెట్లు పడిపోవడంతో రేపల్లెవాడ కూడలి నుంచి పోలవరం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు దారిమళ్లించారు.

పొలాల మధ్య నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని