logo

జన హితం..సంక్షేమ సంతకం

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్ల మొత్తం పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పింఛన్ల పెంపు దస్త్రంపై మూడో సంతకం చేశారు.

Published : 16 Jun 2024 04:35 IST

జిల్లాలో 1,95,759 మంది  పింఛనుదారులకు లబ్ధి 

బ్యాంకులో పింఛన్లు తీసుకుంటున్న మహిళలు (పాత చిత్రం) 

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్ల మొత్తం పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పింఛన్ల పెంపు దస్త్రంపై మూడో సంతకం చేశారు. వైకాపా ప్రభుత్వం వృద్ధులకు నెల వారీగా ఇస్తున్న రూ.3 వేల మొత్తాన్ని రూ.4 వేలకు..  దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచారు. మరికొన్ని ఇతర కేటగిరీల వారికీ పెంపు వర్తించనుంది. ఎన్టీఆర్‌ భరోసా పింఛను పేరిట జులై 1వ తేదీ నుంచి పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ విజయరాజు తెలిపారు.
జిల్లాలో మొత్తం పింఛనుదారులు 2,68,904 మంది ఉన్నారు. ఇందులో 26 కేటగిరీల వారు ఉండగా... 20 కేటగిరీల వారికి పెరిగిన మొత్తంతో కూడిన సొమ్ము అందనుంది. ఇలాం టి వారు 1,95,759 మంది ఉండగా.. ప్రభుత్వంపై రూ.34.48 కోట్ల అదనపు భారం పడనుంది. ఇందులో వృద్ధులు 1,34,805 మంది, దివ్యాంగులు 33,987 మంది ఉన్నారు. వృద్ధులకు నెలకు రూ.4 వేల చొప్పున చెల్లిస్తే ప్రభుత్వంపై అదనంగా రూ.13.24 కోట్లు.. దివ్యాంగులకు రూ.6 వేల చొప్పున చెల్లిస్తే అదనంగా రూ.10.16 కోట్ల భారం పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని