logo

‘ఏకలవ్య’ సంగతేమిటి?

సుమారు రూ.90 లక్షల అంచనాతో అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మాణం మంజూరైంది. టెండర్ల దశ పూర్తికాక పనులు ప్రారంభానికి నోచుకోలేదు.

Published : 18 Jun 2024 02:29 IST

ప్రారంభానికి నోచని భవనాల సముదాయం

సిబ్బంది నివాస భవనం

సుమారు రూ.90 లక్షల అంచనాతో అథ్లెటిక్‌ ట్రాక్‌ నిర్మాణం మంజూరైంది. టెండర్ల దశ పూర్తికాక పనులు ప్రారంభానికి నోచుకోలేదు.

ప్రస్తుతం ఈ విద్యాలయంలో 6 నుంచి 11వ తరగతి వరకు 195 మంది బాలురు, 195 మంది బాలికలు సెంట్రల్‌ సిలబస్‌లో చదువుతున్నారు.

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు సమీపంలోని ఏకలవ్య గిరిజన గురుకుల విద్యాలయంలో రెండో విడత నిర్మించిన భవనాల సముదాయం పనులు పూర్తయి ఆర్నెల్లు కావస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. కె.బొత్తప్పగూడెంలో గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన పాత భవనాల్లో 2019లో ఈ విద్యాలయాన్ని ప్రారంభించారు. తరువాత ఇప్పలపాడు సమీపాన 19.74 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి భవనాల నిర్మాణం చేపట్టారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా రూ.39 కోట్లు మంజూరు చేశారు. రెండు అగ్రిమెంట్లుగా గుత్తేదారుకు పనులు అప్పగించారు. అకడమిక్‌ బ్లాక్, బాలురు, బాలికలకు విడివిడిగా వసతిగృహాలు, వంటశాల, భోజనశాల, రెండు వార్డెన్‌ క్వార్టర్లు, ప్రిన్సిపల్‌ నివాస క్వార్టర్‌ తదితర భవనాల నిర్మాణం చేపట్టారు. వీటిలో మొదటి విడత రూ.23 కోట్ల మేర పనులు చేసి అప్పగించారు. ఆ భవనాలను 2022 డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఆ తరువాత రెండో విడతలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయ సిబ్బంది, వార్డెన్ల క్వార్టర్లు, అంతర్గత రోడ్లు, బాస్కెట్‌ బాల్, వాలీబాల్‌ కోర్టు తదితరాలు నిర్మించారు. పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారుల పర్యవేక్షణలో పనులు చేశారు. ఈ ఏడాది జనవరిలో పనులను పూర్తి చేశామని పీడబ్ల్యూడీ ఏఈ ముప్పన సురేశ్‌ తెలిపారు. ఇంతవరకు ఆ భవనాల సముదాయం ప్రారంభం కాలేదు.

లేఖ రాశాం.. రెండో విడతలో నిర్మాణం పూర్తి చేసిన భవనాల సముదాయం, ఇతరాలను అప్పగించి, ప్రారంభోత్సవం చేసేందుకు ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు ప్రిన్సిపల్‌ బీరా అమృతకుమార్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని