logo

ఇదేమి దారుణం?

పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నెలా సరకుల పంపిణీ లబ్ధిదారులకు సక్రమంగా జరగాలి. కానీ కొంత మంది ఎండీయూ వాహనదారులు రేషన్‌ డీలర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని కొద్ది నెలల కిందట ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది.

Updated : 18 Jun 2024 04:41 IST

సంఖ్యాఫలకం లేని రేషన్‌ వాహనం

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నెలా సరకుల పంపిణీ లబ్ధిదారులకు సక్రమంగా జరగాలి. కానీ కొంత మంది ఎండీయూ వాహనదారులు రేషన్‌ డీలర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని కొద్ది నెలల కిందట ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. అప్పట్లో దానిపై ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వాహనం కూడా గుర్తింపు సంఖ్య లేకుండా తిరగడానికి వీల్లేదని ఆర్డీవో శ్రీనివాసులురాజు స్పష్టం చేశారు. అయినా రాయలం ప్రాంతంలో ఒక వాహనం ఇలా సంఖ్యాఫలకం లేకుండా రేషన్‌ పంపిణీ చేస్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. దీనిపై తహసీల్దార్‌ శివకుమార్‌ను సంప్రదించగా గుర్తింపు సంఖ్య లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనం తిరగకూడదన్నారు. పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని