logo

రైళ్ల దారి మళ్లింపు

విజయవాడ రైల్వే డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాక్‌ పనులు చేపడుతున్నందున... ఈ నెల 21 నుంచి జులై నెలాఖరు వరకు పలు రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు.

Published : 18 Jun 2024 02:43 IST

నరసాపురం, న్యూస్‌టుడే: విజయవాడ రైల్వే డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాక్‌ పనులు చేపడుతున్నందున... ఈ నెల 21 నుంచి జులై నెలాఖరు వరకు పలు రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు. కొన్ని రైళ్లను రామవరప్పాడు వరకు నడపనున్నట్లు చెప్పారు. రోజూ మధ్యాహ్నం 3 గంటలకు నరసాపురం నుంచి విజయవాడ వెళ్లే డెమో రైలును రామవరప్పాడు వరకే నడపుతామన్నారు. ఆ రైలు తిరిగి రాత్రి 8 గంటలకు రామవరప్పాడులో బయల్దేరి అర్ధరాత్రి 12 గంటలకు నరసాపురం చేరుతుందన్నారు. ఎర్నాకులం- పాట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలును జులై 1 నుంచి 22 వరకు భీమవరం, గుడివాడ మీదుగా నడపనున్నట్లు వివరించారు. బావ్‌నగర్‌- కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ రైలును వచ్చే నెల 6 నుంచి 27 వరకు భీమవరం, గుడివాడ మీదుగా, ముంబయి - భువనేశ్వర్‌ రైలును జులై 1 నుంచి 26 వరకు భీమవరం మీదుగా దారి మళ్లించినట్లు వారు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని