logo

నిప్పుల్లా నార చాపలు.. కాలుతున్న కాళ్లు!

చిన వేంకన్న క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మండుటెండలో కాళ్లు మలమలా మాడుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 18 Jun 2024 04:54 IST

శ్రీవారి క్షేత్రంలో భక్తులకు ఇక్కట్లు

శ్రీవారి దర్శన క్యూకాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న ప్రాంతంలో నార చాపలపై నడుస్తున్న భక్తులు 

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: చిన వేంకన్న క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మండుటెండలో కాళ్లు మలమలా మాడుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన నార చాపలను ఎప్పటికప్పుడు నీటితో తడపకపోవడంతో వాటి ఉద్దేశం నెరవేరడం లేదు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే ఆలయాల్లో ద్వారకాతిరుమల చిన వేంకన్న క్షేత్రం ఒకటి. నిత్యం వేలాది మంది తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతుంటాయి. అయితే ఆ మేరకు సౌకర్యాలు ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్ర పరిసరాల్లో సంచరించేటప్పుడు ఎండ తీవ్రతకు కాళ్లు కాలి అల్లాడిపోతున్నారు. తట్టుకోలేక నీడకు పరుగులు తీస్తున్నారు. ఏర్పాటు చేసిన నార చాపలను తడపకపోవడంతో అవి సైతం నిప్పుల్లా కాలుతున్నాయి. ‘భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటాం. నార చాపలను ఎప్పటికప్పుడు నీటితో తడిపిస్తాం’ అని ఆలయ ఈఈ భాస్కరరావు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని