logo

ఏటిగట్టు పొడవునా స్వాగత ద్వారాలు

సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనను పురస్కరించుకుని తెదేపా, జనసేన శ్రేణులు ఏటిగట్టు పొడవునా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు వెళ్లే ముఖద్వారం నుంచి భారీగా ఫ్లెక్సీలతో అలంకరించారు.

Published : 18 Jun 2024 02:49 IST

పోలవరం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనను పురస్కరించుకుని తెదేపా, జనసేన శ్రేణులు ఏటిగట్టు పొడవునా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు వెళ్లే ముఖద్వారం నుంచి భారీగా ఫ్లెక్సీలతో అలంకరించారు. రోడ్డుకిరువైపులా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ల చిత్రపటాలతో కూడిన కటౌట్లను పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. గతంలో  తెదేపా హయాంలో ఆవిష్కరించిన శిలాఫలకాలను పునరుద్ధరించడంతో కొత్త శోభను సంతరించుకున్నాయి.

ప్రాజెక్టులో సందడి.. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటనతో ప్రాజెక్టులో సందడి నెలకొంది. వైకాపా హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  పర్యటన సందర్భాల్లో ఎక్కడికక్కడ పరదాలు, బారికేడ్లతో పటిష్ఠ బందోబస్తు పేరిట హడావుడి కనిపించేది. ఏ కొద్దిమందికో తప్ప అనుమతులు దక్కేవి కావు. మీడియా ప్రతినిధులకు సైతం జగన్‌ పర్యటనను అనుసరించే పరిస్థితి ఉండేది కాదు. ఇక పార్టీ శ్రేణుల పరిస్థితి సరేసరి. కానీ సోమవారం నాటి చంద్రబాబు పర్యటనలో హిల్‌ వ్యూకొండపై నుంచి రోడ్డు మార్గంలో ఇరువైపులా కార్యకర్తలు నిలబడి సీఎంకు స్వాగతం పలికారు.

అధినేతకు ఘనస్వాగతం.. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి పశ్చిమతో పాటు, ఉమ్మడి కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు, ఉన్నతాధికారులు అక్కడికి భారీగా చేరుకున్నారు. సీఎంకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. చంద్రబాబును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు