logo

ప్రక్షాళన పనులు చేపట్టండి

జిల్లాలో బలహీనంగా ఉన్న గోదావరి ఏటిగట్టు పటిష్ఠ  పనులతోపాటు అన్నదాతలకు ఇబ్బంది లేకుండా పంట కాలువలు, డ్రెయిన్లలో తూడు తొలగింపు పనులను అత్యవసరంగా చేపట్టాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.

Published : 20 Jun 2024 03:55 IST

అధికారుల సమీక్షలో మంత్రి నిమ్మల

మొగల్తూరు డ్రెయిన్‌ను పరిశీలిస్తున్న రామానాయుడు

పాలకొల్లు, న్యూస్‌టుడే: జిల్లాలో బలహీనంగా ఉన్న గోదావరి ఏటిగట్టు పటిష్ఠ  పనులతోపాటు అన్నదాతలకు ఇబ్బంది లేకుండా పంట కాలువలు, డ్రెయిన్లలో తూడు తొలగింపు పనులను అత్యవసరంగా చేపట్టాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం పాలకొల్లులోని ఆయన కార్యాలయంలో జలవనరులు, డ్రెయిన్లు, ఏటిగట్టు పరిరక్షణశాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన సమీక్షించారు. గడిచిన అయిదేళ్లలో మాజీ సీఎం అధికార దాహంతో తపించారే తప్ప, అన్నదాతలను ఆదుకోవాలని అనుకోలేదన్నారు. దీనివల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమై పోయాయని తిరిగి గాడిలో పెట్టేలా అధికారులు సమర్థంగా పనిచేయాలని సూచించారు. ఆయా పనులకు సంబంధించి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ధవళేశ్వరం ఎస్‌ఈ జి.శ్రీనివాస్, ఈఈ దక్షిణామూర్తి, డీఈ శ్రీనివాస్, పలువురు ఏఈలు పాల్గొన్నారు. అనంతరం మొగల్తూరు డ్రెయిన్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, తూడును మంత్రి స్వయంగా పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని