logo

కొనలేం.. తినలేం..

కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. అమాంతంగా పెరగడంతో జనం ఏమీ కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు భానుడి భగభగలతో విల విలలాడుతున్న ప్రజలకు ఇప్పుడు కూరగాయల ధరలు భగ్గుమనిపిస్తున్నాయి.

Published : 20 Jun 2024 04:04 IST

మార్కెట్‌లో బెంబేలెత్తిస్తున్న కూరగాయల ధరలు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. అమాంతంగా పెరగడంతో జనం ఏమీ కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వైపు భానుడి భగభగలతో విల విలలాడుతున్న ప్రజలకు ఇప్పుడు కూరగాయల ధరలు భగ్గుమనిపిస్తున్నాయి. మార్కెట్‌కు వెళ్లి టమాటాలు కొందామంటే నోటమాట రావడంలేదు. కొద్ది రోజుల్లోనే అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మార్కెట్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల ఉత్పత్తి లేక పోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మండు వేసవిని తలపిస్తుండటంతో పాటు నీటి సదుపాయంలేక జిల్లాలో ప్రస్తుతం కూరగాయల పంటల సాగు లేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి ఏలూరు మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. టమాటాలు అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి సరఫరా అవుతుంటాయి. అక్కడ కూడా ఉత్పత్తులు తగ్గిపోవడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కిలో టమాటా రూ.80, బీర రూ.80లు ధర పలికాయి. కూరగాయలకు ఏమాత్రం తీసిపోనట్లు ఆకు కూరల ధరలు కూడా ఆకాశనంటుతున్నాయి. కొత్తిమీర కట్ట ఏకంగా రూ.50లు ధర పలికింది.
 గత నెల 19న కిలో టమాటా ధర రూ.28 ఉంది. నెలరోజుల్లో మూడింతలు పెరిగింది. ప్రస్తుతం బయట మార్కెట్‌లో రూ.90 వరకు ధర ఎగబాకింది. రైతు బజారుల్లో ధర రూ.70 ఉంది.

ఎంతో తేడా : సామాన్యులు ఏమీ కొనలేని పరిస్థితి. ధర తక్కువగా ఉన్నపుడు కిలో కూరగాయలు తీసుకెళ్లే దాన్ని. ఇపుడు అర కిలో తీసుకెళ్లడం కష్టంగా ఉంది. పది రోజులకు ఇప్పటికి కూరగాయల ధరల్లో ఎంతో తేడా వచ్చింది’ అని లక్ష్మి తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని