logo

తెదేపా కార్యకర్తపై దాడి చేసిన నలుగురు వైకాపా నాయకులపై కేసు

తెదేపా కార్యకర్తపై దాడి చేసిన నలుగురు వైకాపా నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు సీˆఐ రవికుమార్‌ తెలిపారు.

Published : 20 Jun 2024 04:17 IST

  మాట్లాడుతున్న  సీˆఐ రవికుమార్, పక్కన ఎస్సై సతీశ్‌  

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: తెదేపా కార్యకర్తపై దాడి చేసిన నలుగురు వైకాపా నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు సీˆఐ రవికుమార్‌ తెలిపారు. ఈ మేరకు ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంగిడిగూడేనికి చెందిన తెదేపా కార్యకర్త కాళి అశోక్‌  గతంలో పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుతో పోటీ చేసి ఓడిపోయినట్లు చెప్పారు. అప్పటి నుంచి సర్పంచిగా గెలుపొందిన ప్రత్తిపాటి మహాలక్ష్ముడు మరో వైకాపా నేత గుమ్మడి శ్రీనుతో కలిసి అశోక్‌ను మానసికంగా వేధిస్తున్నారు. ఈ నెల 18న తెదేపా కార్యాలయంలో ఉండగా.. మహాలక్ష్ముడు, గుమ్మడి శ్రీను, బుచ్చయ్య, దేవయ్య కలిసి బయటకు పిలిచి పక్కనే ఉన్న పాడుబడిన రాజావారి కోటలోకి తీసుకెళ్లి దుర్భాషలాడుతూ దాడి చేశారు. గాయపడిన అశోక్‌ను భీమడోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. స్థానిక ఎస్సై సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని