logo

ఠారెత్తిస్తున్న టమాటా

టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజుల నుంచి పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం కేజీ రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు.

Updated : 20 Jun 2024 04:39 IST

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజుల నుంచి పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం కేజీ రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. అదే రైతుబజారులో అయితే రూ.66 ఉంది. మన జిల్లాకి  మదనపల్లి, బెంగళూరు నుంచి అధికంగా దిగుమతి అవుతుంటాయి. ఆయా చోట్ల వర్షాలతో పంట నష్టం జరిగిందని అందుకు ఉత్పత్తి తగ్గి ఉన్న సరకుకి మంచి డిమాండ్‌ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మే మొదటి వారం నుంచి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

జిల్లాలో ప్రజల వినియోగానికి రోజుకి 25 నుంచి 30 టన్నులు టమాటాలు అవసరం అవుతాయని అంచనా. దానికి తగినట్లుగా సరఫరా లేకుండాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుని రైతుబజార్ల ద్వారా విక్రయించాల్సి ఉంది. ‘మదనపల్లి తదితర ప్రాంతాల్లో ఉత్పత్తి లేక సరకు రావడం బాగా తగ్గిపోయింది. ప్రభుత్వమే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్‌ ఆ అంశంపై దృష్టి సారించారు. గురువారం దానిపై వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఒక నిర్ణయం తీసుకుని ఆ మేరకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది’ అని మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి సునీల్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని