logo

సమస్యల పరిష్కారానికి స్నేహ హస్తం

రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని రైల్వే మేనేజర్‌ వై.నాగరాజు పేర్కొన్నారు.

Published : 22 Jun 2024 04:07 IST

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని రైల్వే మేనేజర్‌ వై.నాగరాజు పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో స్నేహ హస్తం అవుట్‌రీచ్‌ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలను, సర్వీసు, పదోన్నతులు, ఇంక్రిమెంట్‌ తదితర అంశాలలో ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించడం జరుగుతుందన్నారు. కమర్షియల్‌ సూపర్‌వైజర్‌ బి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని