logo

స్ఫూర్తి ప్రదాత రామోజీరావు

ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా తలొగ్గకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం నిలవడంలో రామోజీరావు ఎందరికో స్ఫూర్తిదాయకమని సమాచార హక్కు సంఘం (టీమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెస్‌) జాతీయ అధ్యక్షుడు కమ్మ శివరామకృష్ణ అన్నారు.

Updated : 22 Jun 2024 05:27 IST

నివాళులర్పిస్తున్న సంఘ నాయకులు, కాలనీవాసులు

ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా తలొగ్గకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం నిలవడంలో రామోజీరావు ఎందరికో స్ఫూర్తిదాయకమని సమాచార హక్కు సంఘం (టీమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెస్‌) జాతీయ అధ్యక్షుడు కమ్మ శివరామకృష్ణ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని శ్రీరామ్‌ నగర్‌లో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభను శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం శివరామకృష్ణ మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు ‘ఈనాడు’లో ముందడుగు కార్యక్రమం ద్వారా అనేక అవినీతి అక్రమాలపై నిలదీసిన యోధుడు రామోజీరావు అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు ఎం.యుగంధర్‌ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అగ్రహారపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని