logo

‘చింతలపూడి’ పూర్తికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్‌

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు.

Published : 22 Jun 2024 05:16 IST

అధికారులతో సమీక్షిస్తున్న ప్రసన్న వెంకటేశ్‌

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. జాతీయ రహదారులు, జల వనరులు, రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి ప్రస్తుతమున్న అవరోధాలను అధిగమించాలన్నారు. ఒకటి రెండు చోట్ల వివాదాస్పద భూమికి సంబంధించి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దన్నారు. సమావేశంలో జేసీ బి.లావణ్యవేణి, జలవనరుల శాఖ ఎస్‌ఈ శ్రీరామకృష్ణయ్య, ఎన్‌హెచ్‌ఏ పీడీ విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు.

1 నుంచి  అవగాహన కార్యక్రమాలు

డయేరియా నియంత్రణపై జులై 1 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.   రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.  విడిది కార్యాలయం నుంచి ప్రసన్న వెంకటేశ్‌ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని